📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపెద్దపల్లిలో హరీష్ రావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

పెద్దపల్లిలో హరీష్ రావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

📰 Generate e-Paper Clip

పెద్దపల్లిలో హరీష్ రావుకు బీఆర్‌ఎస్ శ్రేణుల ఘన స్వాగతం

మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకుల ఆత్మీయ పలకరింపు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 01

పెద్దపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు ఆదివారం పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా హరీష్ రావుకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన స్థానిక బీఆర్‌ఎస్ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. నాయకులతో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

హరీష్ రావును కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా అభివాదాలు తెలియజేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన రాకతో పెద్దపల్లిలో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో సందడి నెలకొంది.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.