దేశాన్ని ఏకం చేసిన పటేల్: సర్పంచి అశోక్
హనుమాన్ నగర్ తండాలో ఘనంగా ఉక్కుమనిషి జయంతి..
ప్రజావాణి,నెల్లికుదురు: మండలంలోని హనుమాన్ నగర్ తండాలో భారత తొలి ఉప ప్రధాని ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి వేడుక సర్పంచి గుగులోతు అశోక్ కుమార్ అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచి అశోక్ కుమార్ మాట్లాడుతూ చిన్నా భిన్నంగా ఉన్న 560 సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేసి దేశాన్ని ఏకం చేయడానికి చారిత్రక నిర్ణయం తీసుకున్న మహానుభావుడు ఉక్కుమనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉప సర్పంచ్ శ్రీలత యాకు, గ్రామస్తులు రవి,వెంకన్న,లక్పతి,సోమ్ల,రమ్య తదితరులు పాల్గొన్నారు.

