📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

📰 Generate e-Paper Clip

సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్

మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,

మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ క్రైమ్ నేరాలపై ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ అవగాహన సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్ ఫోన్ వాడే విధానంలో విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఫోన్ లో వచ్చిన ప్రతి లింకును ఓపెన్ చేయొద్దన్నారు. మనం ఊహించని రీతిలో సైబర్ నేరగాళ్లు లింకులను పంపిస్తున్నారని అది గమనించి మసులుకుంటే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడమన్నారు. ఒక వేళ సైబర్ క్రైమ్ జరిగితే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.