📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా"యాదవ రెడ్డి"పుట్టినరోజు సంబరాలు

ఘనంగా”యాదవ రెడ్డి”పుట్టినరోజు సంబరాలు

📰 Generate e-Paper Clip

ఘనంగా”యాదవ రెడ్డి”పుట్టినరోజు సంబరాలు
ప్రజావాణి,నెల్లికుదురు: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎదళ్ల యాదవ రెడ్డి పుట్టినరోజు సంబరాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం ఘనంగా నిర్వహించాయి.మండల కేంద్రం నెల్లికుదురులోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి బర్త్ డే వేడుక జరిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్,పార్టీ సీనియర్ నాయకులు,వివిధ గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాదవ రెడ్డి నిరంతర ప్రజా సేవకులని,పార్టీ బలోపేతానికి విశ్రమించకుండా కృషి చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు.

*ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ..*

యాదవ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని వివిధ గ్రామాల సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాదవ రెడ్డి నిరంతరం ఆయురారోగ్యాలతో ఉంటూ మరింత ఉత్సాహంతో పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పార్టీ మండల కమిటీతో పాటు ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.