📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజా శ్రేయస్సులో భాగంగా బియ్యం ధరల నియంత్రణ

ప్రజా శ్రేయస్సులో భాగంగా బియ్యం ధరల నియంత్రణ

📰 Generate e-Paper Clip

ప్రజా శ్రేయస్సులో భాగంగా బియ్యం ధరల నియంత్రణ

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

ప్రజా శ్రేయస్సులో భాగంగా ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణ చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో సమత రైస్ డిపో వారు ఏర్పాటు చేసిన బియ్యం అమ్మకాల అవుట్ లెట్ ను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి వేణుగోపాల్, జిల్లా మేనేజర్ శ్రీకళ, మండల తహసిల్దార్ వనజ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట ధరలకు మించి అమ్మకాలు జరుపకూడదని, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావం వల్ల ప్రస్తుతం మార్కెట్ లో నెలకొని ఉన్న పరిస్థితుల నేపథ్యంలో బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు అందరూ మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రజలకు బియ్యం ధరలను అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ నిర్ణీత ధరకే విక్రయాలు జరిగేలా రెవెన్యూ, పౌర సరఫరాల శాఖల అధికారులతో ఆకస్మిక తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, తనిఖీల కోసం వచ్చే బృందాలకు వ్యాపారులు, ట్రేడర్లు సహకరించాలని తెలిపారు. 26 కిలోల బరువుతో కూడిన ప్రీమియం క్వాలిటీ బి.పి.టి. న్యూ రైస్ బ్యాగ్ ను 1 వేయి 352 రూపాయలు, స్టీమ్ రైస్ ను 1 వేయి 482 రూపాయలు, పాత బియ్యం 1 వేయి 638, హెచ్.ఎం.టి. పాత రకం బియ్యం బస్తా 1 వేయి 950 రూపాయలు, జై శ్రీరామ్ పాత బియ్యం 1 వేయి 976 రూపాయల చొప్పున అవుట్ లెట్ ద్వారా నిబంధనల ప్రకారం విక్రయాలు జరుపుతామని నిర్వాహకులు తెలిపారు
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.