📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై ​

సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై ​

📰 Generate e-Paper Clip

సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో రాణించాలి:ఎస్సై
​
ప్రజావాణి,నెల్లికుదురు: సాఫ్ట్ బాల్ క్రీడా పోటీలలో
జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని ఎస్సై గంగారపు కరుణాకర్ ఆకాంక్షించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ఆవరణంలో ఇటీవల సాఫ్ట్బాల్ పోటీలలో ఎంపికైన జిల్లాలోని 20 మంది క్రీడాకారులకు శిక్షణ శిబిరం ఎస్సై గంగారపు కర్ణాకర్ బుధవారం ప్రారంభించారు. సంబంధిత శిక్షణ శిబిరం ఇనుగుర్తి మండల కేంద్రం హై స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇటీవల జరిగిన సాఫ్ట్బాల్ పోటీలలో జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులను ఎస్ఐ అభినందించారు. ఇటు చదువుల్లో,అటు క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవచ్చని సూచించారు. క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.

*పిడి ప్రణయ్ కు పలువురి అభినందన..*

సాఫ్ట్‌బాల్ జిల్లా అధ్యక్షులు సంజీవరావు, జిల్లా కార్యదర్శి సమ్మెట ప్రేమ్ కుమార్, బేస్‌బాల్ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ నేతృత్వంలో సంబంధిత శిక్షణ నిర్వహించడం కోచ్ గా వ్యవహరించడం హర్షనీయమన్నారు.ఈ కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ ఉపాధ్యక్షుడు ఎ. శ్రీనివాస్, వేముల బాబ్జి, మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మద్ది రాజేష్, వెన్నం క్రాంతిరెడ్డి, చిన్నబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
​
​

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.