ప్రజావాణి నవంబర్ 5
కాశినాయన :
అమగంపల్లెలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
క్యూలైన్లలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.
అమగంపల్లె గ్రామంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటర్లు క్రమశిక్షణ పాటిస్తూ క్యూ లైన్లలో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత ఓటు వేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. మహిళలు, పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
అమగంపల్లెలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు
RELATED ARTICLES

