భార్యను భర్త ఆత్మహత్య చేశాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
వివాహిత మృతి
* భర్తే హత్య చేశాడంటూ కుటుంబ సభ్యుల ఫిర్యాదు పోలీసుల విచారణ
* సీఐ రామకృష్ణ గౌడ్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు
జమ్మికుంటనవంబర్ 4 (ప్రజావాణి)
జమ్మికుంట పట్టణంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మున్సిపల్ పరిధిలోని పద్మశాలి వీధికి చెందిన తాటిపాముల జోష్ణ (33) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. భర్త రాజు తెలిపిన వివరాల ప్రకారం ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఆమెది ఆత్మహత్య కాదని భర్తేహత్య చేశాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మృతురాలు జోష్ణ పద్మశాలి దేనేత సంఘంలో పనిచేస్తూ అందరితో ఆప్యాయంగా ఉండేదని స్థానికులు తెలిపారు ఆమె మృతి విషయం తెలిసిన వెంటనే కార్మికులు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు భార్యాభర్తల మధ్య తరచూగొడవలుజరిగేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో భర్త రాజుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు స్థానికులు అతడి పై చేయి చేసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు భర్త రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తే హత్య చేసినట్లు ఆరోపణలు రావడంతో సీఐ రామకృష్ణ గౌడ్ ఈ ఘటనపై విచారణ చేపట్టారు. జోష్ణది ఆత్మహత్యా, లేక హత్యా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. మృతికి గల అసలు కారణాలు తెలియాల్సి ఉంది

