📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీలప్రైడ్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ

శ్రీలప్రైడ్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ

📰 Generate e-Paper Clip

శ్రీలప్రైడ్ కాలనీ సమస్యల పరిష్కారానికి చర్యలు – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ

కాలనీలో వీధి దీపాల ఏర్పాటు.. తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి భరోసా

కూకట్‌పల్లి, నవంబర్ 1 (ప్రజావాణి):

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ డివిజన్ పరిధిలోని శ్రీలప్రైడ్ కాలనీలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కాలనీ వాసులకు సూచించారు.

అనంతరం కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా, స్పందించిన ఎమ్మెల్యే అవసరమైన ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానని భరోసా ఇచ్చారు.

కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్, అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.