📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆరుట్లలో ఘనంగా గృహప్రవేశ వేడుకలు

ఆరుట్లలో ఘనంగా గృహప్రవేశ వేడుకలు

📰 Generate e-Paper Clip

*ఆరుట్లలో ఘనంగా గృహప్రవేశ వేడుకలు*

*గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మీడియా మిత్రులు*
*ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు*

రంగారెడ్డి జిల్లా నవంబర్ 2 (ప్రజావాణి ) మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన వైయస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, ఆయన సోదరులు ఎల్లేష్‌గౌడ్, కాటంరాజు గౌడ్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇబ్రహీంపట్నం కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాది వెదిరె వేణుగోపాల్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంస్థాన్ నారాయణపురం గ్రామ సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, ఆరుట్ల గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, మంచాల గ్రామ సర్పంచ్ ఏర్పుల మానస వినయ్, తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధగోని గిరిధర్‌గౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి, మునుగోడు నియోజకవర్గ మైనార్టీ నాయకుడు మహమ్మద్ రహీం షరీఫ్, కాంగ్రెస్ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్‌రెడ్డి, ఆరుట్ల మాజీ సర్పంచ్ సుంకరి పండరీనాథ్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, సహకార బ్యాంకు డైరెక్టర్ జెనిగె వెంకటేష్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్, ఆరుట్ల ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అనిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ తదితరులు పాల్గొని నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గృహప్రవేశ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులను జంగయ్యగౌడ్ కుటుంబ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.