అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం.. ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
అన్నదానం మహాదానం.. భక్తులకు సేవ చేయడం పవిత్ర కార్యం
కూకట్‌పల్లి :నవంబర్ 1(ప్రజావాణి)
కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 2లోని సాయిబాబా ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల కోసం ప్రతిరోజూ నిర్వహించనున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాముల దీక్షా సమయంలో భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పవిత్రమైన సేవ అని, అన్నదానం మహాదానమని పేర్కొన్నారు. నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. అయ్యప్ప స్వాముల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

