📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

📰 Generate e-Paper Clip

బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణ సన్నాహాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి.

భూ పరిరక్షణ కొరకు పోరాటాలను ఉదృతం చేస్తాం

డి హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మారుపాక అనిల్ కుమార్


ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో బీపీసీఎల్ (భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి అధికారులు చేస్తున్న సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ దండేపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 439లో మొత్తం 170 ఎకరాల 27 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, 1992లో ఈ భూమిని 299 మంది నిరుపేదలకు పంపిణీ చేశారని అనిల్ కుమార్ తెలిపారు. భూమిలేని పేద కుటుంబాలకు జీవనాధారంగా ఉండాల్సిన ఈ భూమిపై ఇప్పుడు బీపీసీఎల్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణానికి సన్నాహాలు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
భూమిలేని పేదలకు పంపిణీ చేసిన భూములను వారి నుంచి దూరం చేసే చర్యలకు ప్రభుత్వం పాల్పడకూడదని ఆయన పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అభివృద్ధి పేరుతో పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే చర్యలను అనుమతించరాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం భూమిని సాగు చేసుకుంటున్న వారిని గుర్తించి, అర్హులైన సాగుదారులకు చట్టబద్ధమైన స్వాధీన హక్కులు కల్పించాలని కోరారు. భూముల స్థితిగతులు,లబ్ధిదారుల హక్కులపై సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే స్పందించి బీపీసీఎల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన సన్నాహాలను నిలిపివేయాలని, భూమి లబ్ధిదారులు మరియు ప్రస్తుత సాగుదారుల హక్కులకు రక్షణ కల్పించాలని మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.పేదలకు న్యాయం జరిగే వరకు వారి భూముల పరిరక్షణ కోసం డి హెచ్ పి ఎస్ పేదల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామెర లక్ష్మణ్,డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి నిమ్మల మనోహర్,బి కె యం యు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్,సీపీఐ మండల సహాయ కార్యదర్శి గడ్డం రాజనర్సు,రేణిగుంట్ల సాంబయ్య, గడ్డం సంధ్య,జాజాల సరోజన,జన్ను లింగయ్య,మారుపాక సంపత్,గడ్డం పూల,అజయ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.