పాత్రికేయుల సేవలకు బండి రమేష్ ప్రశంసలు.. సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్‌కు దీపావళి శుభాకాంక్షలు
ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర కీలకం.. జర్నలిస్టుల సేవలు అభినందనీయం
కూకట్‌పల్లి, నవంబర్ 7 (ప్రజావాణి):
కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్‌తో పాటు పాత్రికేయులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ జర్నలిస్టులు అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య పాత్రికేయులు వారధిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న సీనియర్ జర్నలిస్టుల సేవలను ప్రత్యేకంగా అభినందించారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సీనియర్ జర్నలిస్టు మునిపల్లి నరేష్ యాదవ్‌కు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం పట్ల పాత్రికేయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. జర్నలిస్టుల పట్ల గౌరవం, వారి సేవలను గుర్తించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

