📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనెల్లుట్లలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు, సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

నెల్లుట్లలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు, సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

నెల్లుట్లలో ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు, సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా

సర్పంచ్, గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘన వేడుకలు, కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి, పండ్లు పంపిణీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి): జిల్లా లోని లింగాలఘణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ నర్సింగ రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మాచెర్ల మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు మరియు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి, పండ్లు పంపిణీ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ గుడి వంశీధర్ రెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతోందని, ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొల్లూరి శివ కుమార్, జిల్లా కార్యదర్శి బొల్లంపల్లి నాగేందర్, జిల్లా సంయుక్త కార్యదర్శి దామెర నాగరాజు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు నర్సింగ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని అశోక్ కుమార్ గౌడ్, మండల కార్యదర్శులు కొయ్యడ రామలింగం గౌడ్, గడ్డం యాదగిరి, ఉప సర్పంచ్ దామెర కావ్య ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ మోటే వీరాస్వామి, వార్డ్ సభ్యులు బత్తిని వేణు, వేల్పుల శోభారాణి, బొజ్జం సునీత ప్రభాకర్, నల్ల అజయ్, నల్ల విల్సన్, గొరిగే సందీప్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుషిగుంపల ఆంజనేయులు, సీనియర్ నాయకులు మారబోయిన ఉపేందర్, బొజ్జం లక్ష్మణ్, గండి శ్రీనివాస్, కొయ్యడ సుమన్, జెగ్గం ఆనంద్, కొయ్యడ రామచంద్రం, కొత్తకొండ గోవర్ధన్, కుర్రెముల రమేష్, తుపాకుల వెంకటేష్, నర్సింగ కిరణ్, కొండ్ర యోనా, జెగ్గం అశోక్, నర్సింగ చంద్రయ్య, గాడిపెల్లి భాస్కర్, కొత్తకొండ గంగాధర్, చిట్ల తిరుమల రెడ్డి, ఎడ్ల జాన్, జిగురు ఉపేందర్, పెరబోయిన శ్రీనివాస్, కూడికాల సాయి కుమార్, నల్ల రామనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.