📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదాచారంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

దాచారంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

దాచారంలో ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

బెజ్జంకి,నవంబర్ 8 (ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామంలో ఆదివారం అత్యంత ఘనంగా గ్రామ సర్పంచ్ బైరా మనసా రాజేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి చిన్నారులకు, గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బైరా మనసా రాజేందర్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఆయనపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత కాలం సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్, మహేష్, భాస్కర్, బోడిగే రాంచంద్రం, వడ్లకొండ నర్సయ్య, శ్రీను,రాజేశం, సత్తి తిరుపతి, రమేష్, కార్యకర్తలు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.