📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరేవంత్ రెడ్డి జన్మదినోత్సవం ఘనంగా

రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం ఘనంగా

📰 Generate e-Paper Clip

రేవంత్ రెడ్డి జన్మదినోత్సవం ఘనంగా—

జవహర్ నగర్, నవంబర్ 8: (ప్రజావాణి ప్రతినిధి)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జవహర్ నగర్ మాజీ మేయర్ డివిజన్ అధ్యక్షురాలు శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి.

కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
ఈ సందర్భంగా కేకును కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పేదలకు పండ్ల పంపిణీ
అనంతరం పేదలు, వృద్ధులు, మహిళలకు పండ్ల పంపిణీ చేశారు. అందరూ సంతోషంతో పండ్లు తీసుకున్నారు.
శాంతి కోటేష్ గౌడ్ మాట్లాడుతూ
రేవంత్ రెడ్డి జన్మదినం మాకు పండుగ వంటిది. ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి.
రైతుకు రైతు భరోసా, రుణమాఫీతో భరోసా ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకంతో అండగా నిలిచారు. గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ళు, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ తో ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చారు.
ఇందిరమ్మ ఇళ్లలోనే మా పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి ఇదే మా కృతజ్ఞత.
రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో.మాజీ మేయర్ జవహర్ నగర్ డివిజన్ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్ మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్ కార్పొరేటర్ మనోధర్ రెడ్డి చింతల శ్రీనివాస్ కృష్ణాగౌడ్ సుబ్రహ్మణ్యం జామల్పూర్ నవీన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి గొడుగు వేణు మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ A బ్లాక్ అధ్యక్షులు మాట్లా శ్రీనివాస్ ఉపాధ్యక్షులు మాట్లా వినయ్ ప్రధానకార్యదర్శి నాయకం భాస్కర్ DSS వెంకటేష్ గజ్వెల్ శంకర్ కోశాధికారి పొలాస కిరణ్ కుమార్ ప్రచార కార్యదర్శి ఆకుల ప్రభాకర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు md రఫీక్ వీర్ల బుజంగం సుబ్రహ్మణ్యం రాజు ఓడు పు రామకృష్ణ కన్నబోయిన రాజు యాదవ్ సోమేశ్ చారీ కోయడ అజయ్ షఫీ రమేష్ చారీ బూడిద వెంకటేష్ సాగంటి వెంకటేష్ సత్యనారాయణ జగదీష్ తదితరులు పాలుగోన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.