📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅక్షయ స్కూల్ & కాలేజ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

అక్షయ స్కూల్ & కాలేజ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు

📰 Generate e-Paper Clip

అక్షయ స్కూల్ & కాలేజ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు – ఉద్యోగులకు దుస్తులు, స్వీట్ బాక్సుల పంపిణీ మన సమగ్ర ప్రజావాణి నవంబర్:08
[సంగారెడ్డి ప్రతినిధి]
సంగారెడ్డి: సంగారెడ్డి మల్కాపూర్ లోని అక్షయ స్కూల్ & కాలేజ్‌లో దీపావళి పండుగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ యాజమాన్యం దుస్తులు, స్వీట్ బాక్సులను అందజేసింది.
ఈ సందర్భంగా ఉద్యోగులు సంస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని యాజమాన్యం అభినందించింది. ఉద్యోగుల కృషి, సహకారంతోనే సంస్థ అభివృద్ధి సాధ్యమవుతోందని పేర్కొంది.
అనంతరం ఉద్యోగులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.