*కేటీఆర్‌ను కలిసిన ముధోల్ బీఆర్ఎస్ నాయకులు-
హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వక భేటీ.. దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సిరిపెల్లి హెచ్ సర్పంచ్ ఆరెపల్లి సతీష్*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో నవంబర్ 8:–
ముధోల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు, సిరిపెల్లి హెచ్ గ్రామ సర్పంచ్ ఆరెపల్లి సతీష్ ఆదివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వెళ్లిన ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ముధోల్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, స్థానిక రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు సమాచారం.

