బెజ్జంకి, నవంబర్ 8 (ప్రజావాణి)
సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను సర్పంచ్ బైరా మనసా రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు, గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు అశోక్, మహేష్, భాస్కర్, బోడిగే రాంచంద్రం, వడ్లకొండ నర్సయ్య, శ్రీను, రాజేశం, సత్తి తిరుపతి, రమేష్, కార్యకర్తలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

