కలసపాడులో టపాసుల స్టాల్స్ వద్ద భద్రత కరువు! అధికారులు తూతూమంత్రం తనిఖీలు.
కలసపాడు,నవంబర్ 08 ప్రజావాణి దీపావళి పండుగ వేళ కడప జిల్లా కలసపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రాలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.నిబంధనలను తుంగలో తొక్కి, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ఈ స్టాళ్లపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎలాంటి అగ్నిమాపక, రక్షణ చర్యలు చేపట్టకుండానే జనావాసాల మధ్య,రద్దీగా ఉండే ప్రాంతాల్లో వ్యాపారాలు సాగిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయినిబంధనలు కాగితాలకే పరిమితం భద్రత శూన్యం!ప్రభుత్వ నిబంధనల ప్రకారం టపాసుల దుకాణాల వద్ద ఖచ్చితంగా అగ్నిమాపక యంత్రాలు...