ఆపదలో మహిళకు అండగా పోలీసులు
*ఆపదలో మహిళకు అండగా పోలీసులు* -ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్, హోంగార్డు సేవలకు డీజీపీ అభినందనలు మన ప్రజావాణి / ఎల్లారెడ్డిపేట: ఆపదలో ఉన్న మహిళకు సకాలంలో సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ అభినందనలు తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్‌తో ఓ మహిళ అకస్మాత్తుగా కుప్పకూలడాన్ని గమనించిన కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ వెంటనే స్పందించారు. ఆమెకు ప్రథమ చికిత్స అందించి అవసరమైన సహాయం చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళకు అండగా నిలవడంపై పలువురు...