అక్షయ స్కూల్ & కాలేజ్లో ఘనంగా దీపావళి వేడుకలు
అక్షయ స్కూల్ & కాలేజ్లో ఘనంగా దీపావళి వేడుకలు – ఉద్యోగులకు దుస్తులు, స్వీట్ బాక్సుల పంపిణీ మన సమగ్ర ప్రజావాణి నవంబర్:08 [సంగారెడ్డి ప్రతినిధి] సంగారెడ్డి: సంగారెడ్డి మల్కాపూర్ లోని అక్షయ స్కూల్ & కాలేజ్లో దీపావళి పండుగను పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ యాజమాన్యం దుస్తులు, స్వీట్ బాక్సులను అందజేసింది. ఈ సందర్భంగా ఉద్యోగులు సంస్థలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని యాజమాన్యం అభినందించింది. ఉద్యోగుల కృషి, సహకారంతోనే సంస్థ...