📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ16వ వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

16వ వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

16వ వార్డులో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం

జోగిపేట, అక్టోబర్ 06: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

ఐసిడిఎస్ జోగిపేట ఆధ్వర్యంలో 9వ పోషణ మాసం కార్యక్రమాన్ని జోగిపేట 16వ వార్డులోని స్థానిక అవుసలి సంఘంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా గర్భిణీలు, కిశోర బాలికలు తీసుకోవాల్సిన పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది విపులంగా అవగాహన కల్పించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, శిశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
ఈ కార్యక్రమానికి ఆందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), 16వ వార్డు కౌన్సిలర్ పట్లోల శ్రీనివాస్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి లలితకుమారి, ఐసిడిఎస్ సిడిపిఓ మధులత, ఎం ఈ పి ఎం ఏ టీఎంసీ బిక్షపతి గౌడ్తో పాటు ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, ఎం ఈ పి ఎం ఏ ఆర్పీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.