*గుబ్బగుర్తి పాఠశాలలో వన్యప్రాణుల వారోత్సవాలు*
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 72వ వన్యప్రాణుల వారోత్సవాల సందర్భంగా ఖమ్మం జిల్లా కొ ణిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించారు.
వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అడవుల ప్రాధాన్యతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచి గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దంతాల ప్రశాంతి నరసింహారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివన్నారాయణ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జీ. ఉపేంద్రయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి. సైదా, యు. అయోధ్యమ్మ, జ్యోతి, ఏఏపీసీ చైర్‌పర్సన్ నాగమణి 
ఉపాధ్యాయులు మురళీకృష్ణ, లలిత భారతి, వెంకటేశ్వర్లు, చారి, సుజాత, భాస్కర్ తో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వన్యప్రాణులు, అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కార్యక్రమ నిర్వాహకులు ఉపేంద్రయ్య తెలిపారు.

