📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓటు చోరీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న లింగాల ఘనపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు

ఓటు చోరీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న లింగాల ఘనపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు

📰 Generate e-Paper Clip

*ఓటు చోరీకి వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న లింగాల ఘనపురం కాంగ్రెస్ పార్టీ నాయకులు*

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటు చోరీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం INDIA కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ పశ్చిమ ద్వారం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు సాగింది. ఈ ర్యాలీలో లింగాల ఘనపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… దేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు అనేది ప్రతి పౌరుడి జన్మహక్కు అని, అలాంటి ఓటు హక్కును చోరీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఓట్లను తొలగించి, అక్రమంగా ఓట్లను చేర్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు విలువను గుర్తించి, బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో లింగాల ఘనపురం మండలం నుంచి జిల్లా సంయుక్త కార్యదర్శి దామెర నాగరాజు, నెల్లట్ల గ్రామ శాఖ అధ్యక్షులు మాచర్ల మహేందర్ గౌడ్, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు నర్సింగ రమేష్, సీనియర్ నాయకులు జెగ్గం ఆనంద్ , గడ్డం యాదగిరి , దీకొండ రాజు , కడారి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.