📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ15వ వార్డు ఎస్సీ కాలనీ కేశవపురం గ్రామంలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్...

15వ వార్డు ఎస్సీ కాలనీ కేశవపురం గ్రామంలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించాలి

📰 Generate e-Paper Clip

15వ వార్డు ఎస్సీ కాలనీ కేశవపురం గ్రామంలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్‌ను తొలగించాలి

* విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈకి వినతిపత్రంపాతకాల ప్రవీణ్

జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని 15వ వార్డు పరిధిలో ఉన్న కేశవపురం గ్రామం ఎస్సీ కాలనీ మీదుగా వీణవంక సబ్‌స్టేషన్‌కు వెళ్లే 33 కేవీ విద్యుత్ లైన్ గ్రామస్తుల ఇళ్ల మీదుగా వెళ్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారుఈ విద్యుత్ లైన్ కారణంగా కొంతకాలం క్రితం ఒకరు ప్రాణాలు కోల్పోయారని, అంతేకాకుండా అప్పుడప్పుడు విద్యుత్ వైర్ల నుంచి మంటలు రావడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు చిన్నపిల్లలు, వృద్ధుల భద్రతపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయిఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో పాతకాల ప్రవీణ్ జమ్మికుంట విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
కేశవపురం గ్రామంలోని ఇళ్ల మీదుగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్‌ను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అవసరమైన సాంకేతిక పరిశీలన అనంతరం విద్యుత్ లైన్‌ను సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గంలోకి మార్చాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారుప్రజల ప్రాణ భద్రతే ముఖ్యమని, అధికారులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని పాతకాల ప్రవీణ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.