📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలకు ప్రత్యేక ఏర్పాట్లు

చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలకు ప్రత్యేక ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనాలకు ప్రత్యేక ఏర్పాట్లు పరిశీలించిన

* మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట అక్టోబర్ 30 (ప్రజావాణి)

జమ్మికుంట స్థానిక బొమ్మలగుడి ఆవరణలో నవంబర్ 2వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి జమ్మికుంట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్ ) స్థానిక వార్డు కౌన్సిలర్ చందా రాజు అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో భారీ గేట్ల ఏర్పాటు సహా ప్రత్యేక ఏర్పాట్లు మున్సిపల్ చైర్మన్ పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం జమ్మికుంట గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని కేటాయించామని తెలుపుతూ అదేవిధంగా ప్రవచన కార్యక్రమానికి హాజరయ్యే భక్తులందరూ ముందుగానే కార్యక్రమ ప్రాంగణానికి చేరుకోవాలని,తమకు కేటాయించిన సీట్లలోనే కూర్చొని క్రమశిక్షణ పాటించాలని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రవచన కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి ఒక్కరూ నిర్వాహకులకు సహకరించాలని కోరారు ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మిక ప్రవచనాలను ఆస్వాదిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు పిలుపునిచ్చారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.