📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసైబర్ నేరాలు, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి

సైబర్ నేరాలు, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

సైబర్ నేరాలు, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలి

ఆన్‌లైన్ బెట్టింగ్, పోక్సో చట్టంపై పోలీసుల అవగాహన

తంగళ్లపల్లి ప్రజావాణి అక్టోబర్ 03తంగళ్లపల్లి మండలంలోని ఐటీఐ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగే మోసాలు, మైనర్లపై జరిగే నేరాలు, పోక్సో చట్టం తదితర అంశాలపై పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, సీఐలు పాల్గొని విద్యార్థులకు నేరాల పట్ల అప్రమత్తత, చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, యువత అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులను తెరవవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు, ఏటీఎం వివరాలను ఎవరికీ చెప్పవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు యువత దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి వాటికి దూరంగా ఉంటూ చదువు, నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై దృష్టి సారించాలని పోలీసులు సూచించారు. యువతలో నేరాలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఇట్టి అవగాహన కార్యక్రమంలో రూరల్ సీఐ కె నాగేశ్వరరావు, ఎస్సై సిరిసిల్ల అశోక్, ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, కానిస్టేబుల్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.