నారాయణఖేడ్ నియోజకవర్గం
(ప్రజావాణి):-
శ్రీ సాయి చైతన్య హై స్కూల్ లో బతుకమ్మ ముందస్తు సంబరాలు
పెద్దశంకరంపేట,అక్టోబర్ 09:
పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సాయి చైతన్య హై స్కూల్ లో జరిగిన బతుకమ్మ పండుగ ముందస్తు వేడుకలను శుక్రవారం నాడు అత్యంత వైభవంగా, కోలాహలంగా నిర్వహించారు. ?ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది, సంప్రదాయ దుస్తులు ధరించి పాఠశాల ప్రాంగణంలో ప్రతిష్టించారు. బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ, ఆటపాటలతో ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొల్పారు.?ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, పూల పండుగ బతుకమ్మకు విశిష్టమైన గుర్తింపు ఉందన్నారు. విద్యార్థుల్లో మన ఆచార వ్యవహారాలు, సంస్కృతిపై అవగాహన, గౌరవం పెంపొందించేందుకే ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నేటి తరానికి మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేస్తాయని పేర్కొన్నారు.? ఈ వేడుకల్లో పాఠశాల కరస్పాండెంట్లు గంగాధర్ గౌడ్, భూమేశ్వర్ గౌడ్, శ్రీకర్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

