📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపుట్టపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పుట్టపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

పుట్టపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
పరిగి, అక్టోబర్ 10( ప్రజావాణి)
కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేంద్ర బహదూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాఠశాలకు తీసుకొచ్చారు. పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మలను ఉంచి, విద్యార్థినులు, ఉపాధ్యాయులు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడి, ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మహేంద్ర బహదూర్ మాట్లాడుతూ, ప్రకృతిని ఆరాధిస్తూ, స్త్రీల ఐక్యతను చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని కొనియాడారు. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయడానికే పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం విద్యార్థులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.