వేముల మహేష్ గౌడ్ చేతుల మీదుగా నూతన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ
ఘట్కేసర్, అక్టోబర్ 26 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ స్మార్ట్ కార్డులను ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ ఘనపురం గ్రామంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పంపిణీ చేశారు. స్థానిక రేషన్ దుకాణం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పౌరసరఫరాల...