📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవరి కోతల్లో భారీ కొండచిలువ కలకలం

వరి కోతల్లో భారీ కొండచిలువ కలకలం

📰 Generate e-Paper Clip

వరి కోతల్లో భారీ కొండచిలువ కలకలం!
నేలపట్లలో 10 నుంచి 12 అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షం
కూసుమంచి, అక్టోబర్ 24 (ప్రజావాణి) ప్రతినిధి RK :
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో వరి కోతలు కోస్తుండగా భారీ కొండచిలువ ప్రత్యక్షమై రైతులను భయాందోళనకు గురిచేసింది. గ్రామానికి చెందిన అలవాల లింగయ్య పొలంలో వరి పంట కోస్తుండగా సుమారు 10 నుంచి 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించింది.
ఊహించని విధంగా పొలంలో భారీ కొండచిలువ కనిపించడంతో రైతు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. వెంటనే స్థానికులకు సమాచారం అందించడంతో పలువురు రైతులు అక్కడికి చేరుకున్నారు. భారీ కొండచిలువను చూసిన రైతులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం కొండచిలువను హతమార్చినట్లు తెలిసింది.
రైతులు అప్రమత్తంగా ఉండాలి!
ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పొలాల్లో పాములు, ఇతర విషపూరిత జీవులు కనిపించే అవకాశం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు. వరి కోతల సమయంలో పొలాల్లోకి వెళ్లేటప్పుడు పరిసరాలను జాగ్రత్తగా గమనించాలని, పాములు కనిపిస్తే వాటిని చంపకుండా సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.