📄 ePaper
Epaper 2
Sunday, October 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు

📰 Generate e-Paper Clip

రాష్ట్ర పోటీలకు ఇనుగుర్తి విద్యార్థులు
హెచ్ఎం యాకయ్య
ప్రజావాణి,ఇనుగుర్తి:రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ టెన్నిస్,గట్కా పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం అమ్మ యాకయ్య తెలిపారు. శుక్రవారం ఫిజికల్ డైరెక్టర్ తాళ్ల ప్రణయ్ తో కలిసి మాట్లాడుతూ 70వ రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి పోటీలకు ఇటీవలే జే ఎన్ ఎస్ స్టేడియం లో సెలక్షన్ నిర్వహించడం జరిగిందని అందులో మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు టెన్నిస్ అండర్ 17 విభాగంలో 1)సంగేమ్ రాజు 2) మోరపోజు చైతన్య రిషి సెలెక్ట్ కాగా టెన్నిస్ అండర్ 14 విభాగంలో పార్నంది హర్షవర్ధన్, అదేవిధంగా ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు గట్కా అండర్ 17 విభాగంలో 1) జాటోత్ అజయ్ 2) సాత్విక్ ఎంపిక అయ్యారని, ఈనెల 11వ తేదీ నుండి 13 వరకు అండర్ 14 టెన్నిస్ క్రీడలు హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఇందిరా పార్క్ లో జరగనున్నాయి ఇదే తేదీలలో గట్కా క్రీడలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జరగనున్నాయని అండర్ 17 టెన్నిస్ క్రీడలు ఈ నెల 13 వ తారీకు నుండి 15 వరకు హన్మకొండ లోని జే ఎన్ ఎస్ టెన్నిస్ కోర్టు లో జరగనున్నాయని. విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచినందుకు స్కూల్ హెడ్మాస్టర్ అమ్మా యాకయ్య, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్ తాళ్ళ ప్రణయ్ ని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.