📄 ePaper
Epaper 2
Sunday, October 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదోమకొండ ఎక్సైజ్ సీఐ సర్వేశ్వరరావుకు ఘన సన్మానం

దోమకొండ ఎక్సైజ్ సీఐ సర్వేశ్వరరావుకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

దోమకొండ ఎక్సైజ్ సీఐ సర్వేశ్వరరావుకు ఘన సన్మానం

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 09

దోమకొండ ఎక్సైజ్ సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్వేశ్వరరావును జైగౌడ్ ఉద్యమం జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. దోమకొండ ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఐ సర్వేశ్వరరావుకు శాలువా కప్పి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ సర్వేశ్వరరావుకు జైగౌడ్ ఉద్యమం నాయకులు అభినందనలు తెలియజేశారు. ఆయన తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జైగౌడ్ ఉద్యమం నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.