రాచకొండ బతుకమ్మ వేడుకలకు ఆహ్వానిస్తున్నాము – ఇఎల్వీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఇరుగదిండ్ల భాస్కర్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన మన బతుకమ్మ పండుగ వేడుకలకు అందరికీ ఘన స్వాగతం! రాచకొండ దసరా ఉత్సవాలు 2026 సందర్భంగా, రాచకొండ ఉత్సవ సమితి, ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మన చండూరు మండల కేంద్రంలోని బస్టాండ్ పక్కన ఉన్న ఆవరణలో ఈనెల 17 వ తేదీన బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మహోత్సవానికి ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్, మన అందరి ప్రియతమ నేత అయినటువంటి డా|| ఇరగదిండ్ల భాస్కర్ ముఖ్య అతిథిగా విచ్చేయుచున్నారు. ఈ సంబరాల్లో పాల్గొనే మహిళలకు, చిన్నార్లకు ప్రత్యేక ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందించబడును మొదటి బహుమతి ₹20,000/- రూపాయలు రెండవ బహుమతి ₹15,000/- రూపాయలు మూడవ బహుమతి ₹10,000/- రూపాయలు. మన మున్సిపాలిటీ, మండలంలోని అన్ని గ్రామాల మహిళలు, యువతులు మరియు చిన్నారులు అందరూ రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాంప్రదాయ దుస్తులలో విచ్చేసి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆదరపూర్వకంగా కోరుచున్నాము.

