📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమైతాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పూల జాతరను తలపించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు

మైతాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పూల జాతరను తలపించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు

📰 Generate e-Paper Clip

*మైతాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పూల జాతరను తలపించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు*

*రాయికల్, అక్టోబర్ 09 (ప్రజావాణి):*

రాయికల్ మండలం మైతాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ శుక్రవారం పూల జాతరను తలపించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ముందస్తు బతుకమ్మ వేడుకలను పాఠశాలలో అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినులు ఉదయం నుండే ఉత్సాహంగా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, బంతి, చామంతి, తామర వంటి రంగురంగుల పూలను సేకరించి అత్యంత అందంగా, పేర్చి పెద్ద పెద్ద బతుకమ్మలను తయారు చేశారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ వలయంగా చేరి చప్పట్లు కొడుతూ “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో” అంటూ సాంప్రదాయ పాటలు అలపిస్తూ కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. చిన్నారుల ఆటపాటలు, వారి ముఖాల్లోని ఆనందం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన, ప్రకృతిని ప్రేమించే తత్వం పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు వేముల మధు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ ఆడబిడ్డల గొప్ప పండుగని, పూలను పూజించే గొప్ప సంప్రదాయం మనదని, ప్రకృతిని కాపాడుకోవాలనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు కల్వకోట కార్తీక్, వేముగంటి గిరిధర్, అంతడుపుల గంగరాజం, సిద్ధ గంగరాజం, రాపర్తి నరసయ్య తదితరులు పాల్గొని విద్యార్థినులను అభినందించి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.