*నర్సాపూర్ ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం*
*అంగన్వాడీ సేవలు అభినందనీయం – ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి*
నర్సాపూర్. అక్టోబర్ 9 ప్రజావాణి
నర్సాపూర్ మండలంలోని రైతు వేదిక వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరై అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు జన్మించిన అనంతరం కూడా తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు అంగన్వాడీ టీచర్లు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ప్రతి గ్రామంలో పోషణ మాసంలో అనేక కార్యక్రమాల ద్వారా గ్రామంలోని ప్రతి ఒక్కరికి పోషణ గురించి వివరించడం జరుగుతుంది అని తెలిపారు ప్రతి గ్రామంలో ఆరోగ్యం పోషణ గురించి అంగన్వాడీ టీచర్ పాత్ర ఎంతో ఉంటుందని కొనియాడారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీడబ్ల్యూఓ హేమాభార్గవి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బయట లభించే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని, ఇంట్లోనే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తయారు చేసి పిల్లలకు అందించాలని సూచించారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ మండలాల నుంచి వచ్చిన గతంలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడిన పిల్లలను సాధారణ బరువు స్థాయికి తీసుకురావడంలో సాధించిన విజయాలను తల్లులు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిన సేవలు, పిల్లల పెంపకంలో తీసుకున్న జాగ్రత్తలు, పోషకాహారం అందించడం ద్వారా పిల్లల ఆరోగ్యంలో వివరించడం జరిగింది. అనంతరం పోషణ మాసంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణ కార్యక్రమాలు నిర్వహించిన బెస్ట్ అంగన్వాడీ టీచర్లను ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మండల ఎంఈఓ ఆర్ బి ఎస్ కే డాక్టర్ శ్రీలత మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన తల్లులు పాల్గొన్నారు. అనంతరం నర్సాపూర్ బస్టాండ్ లో గల బిడ్డకు పాలు ఇవ్వడానికి పాలిచ్చే కేంద్రాన్ని ప్రారంభించడం జరిగినది.

