మైతాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పూల జాతరను తలపించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు
*మైతాపూర్ జడ్పీహెచ్ఎస్ లో పూల జాతరను తలపించిన ముందస్తు బతుకమ్మ వేడుకలు* *రాయికల్, అక్టోబర్ 09 (ప్రజావాణి):* రాయికల్ మండలం మైతాపూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ శుక్రవారం పూల జాతరను తలపించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ముందస్తు బతుకమ్మ వేడుకలను పాఠశాలలో అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.వేడుకల్లో భాగంగా పాఠశాల విద్యార్థినులు ఉదయం నుండే ఉత్సాహంగా పాల్గొన్నారు. గునుగు, తంగేడు, బంతి, చామంతి, తామర వంటి రంగురంగుల పూలను సేకరించి అత్యంత అందంగా, పేర్చి పెద్ద పెద్ద...