📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్దూరులో జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం

మద్దూరులో జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం

📰 Generate e-Paper Clip

మద్దూరులో జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దగ్ధం

మద్దూరు అక్టోబర్23, ప్రజా వాణి,

కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని గొర్రెల మేకల పెంపకదారుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి డిమాండ్ చేశారు. శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలో సిఐటియు, రైతు సంఘం, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం, ప్రజానాట్యమండలి ,సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలో ప్రతిపక్షాల నాయకులవి, ప్రశ్నించే వారి ఓట్లను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని బాధ్యులైన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఎండి షఫీ,రైతు సంఘం మండల కార్యదర్శి బెజాడి మల్లారెడ్డి,ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి వేల్పుల విజయ్ కుమార్,నాయకులు పిట్టల నరేష్, మల్లేశం,మురళి, సాయిలు,ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.