📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలో...

జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలో ఘనంగా దసరా అలయ్ బలయ్ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలో ఘనంగా దసరా అలయ్ బలయ్ కార్యక్రమం..

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విజయదశమి

శుభాకాంక్షలు తెలిపిన డోన్ గావ్ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 23

విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నివాసంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్, కౌలాస్, సావర్గావ్, లాడే గావ్ , సోపూర్, లొంగన్, వజ్రకండి, వివిధ గ్రామాల నుండి అలాగే వివిధ మండలాల నుండి తదితర గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయం ప్రకారం జమ్మి ఆకులను బంగారంగా భావించి పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.
దసరా అలయ్ బలయ్ కార్యక్రమం సంప్రదాయాలు, ఆత్మీయత, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరే శ్రీనివాస్, బాపు పటేల్, మనోజ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.