📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమంజీరా వాగులో అక్రమ ఇసుక దందా

మంజీరా వాగులో అక్రమ ఇసుక దందా

📰 Generate e-Paper Clip

*మంజీరా వాగులో అక్రమ ఇసుక దందా?*

• తెల్లవారుజామున ఇసుక తరలింపు.. సాయంత్రం అధికారుల తనిఖీలు

అందోల్ : చౌటకూరు అక్టోబర్ 06 మన సమగ్ర ప్రజావాణి
జిల్లా ప్రతినిధి

అందోల్ మండల పరిధిలోని సరాపల్లి, కొర్పోల్, శివంపేట్, చౌటకూర్ గ్రామాల పరిసరాల్లో మంజీరా వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెల్లవారుజామునే ఇసుక తరలింపు వాహనాలు తిరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం సాయంత్రం వేళల్లో తనిఖీలకు వస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధికారులు తనిఖీలకు వచ్చే సమయానికి ఇసుక తరలింపు వాహనాలు అక్కడ లేకపోవడంతో అక్రమ దందాపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక తరలింపుతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, భూగర్భ జలాలు తగ్గి సాగునీటి సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు గ్రామస్తులు అధికారుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అక్రమ ఇసుక దందాకు ఎవరి అండదండలు ఉన్నాయో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
మంజీరా వాగు ప్రాంతాన్ని పర్యవేక్షించే తహసీల్దార్, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది సమగ్రంగా తనిఖీలు నిర్వహించి, అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలని రైతులు కోరుతున్నారు. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేపట్టి వాహనాలను పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అక్రమ ఇసుక దందాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.