📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబోరంచ నల్లపొచమ్మ ఆలయం లో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

బోరంచ నల్లపొచమ్మ ఆలయం లో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*బోరంచ నల్లపొచమ్మ ఆలయం లో రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు*

*ప్రజావాణి న్యూస్ అక్టోబర్ 10 సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి*

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపొచమ్మ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు నున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 11 నా బాలా త్రిపుర సుందరి దేవి, 12నా గాయిత్రి దేవి, 13నా అన్నపూర్ణ దేవి,14న మంగళగౌరీ దేవి, 15న లలిత దేవి,16న సరస్వతీ దేవి,17న మహాలక్ష్మి దేవి,18న దుర్గాదేవి ,19న మహిషాసుర మర్ధిని దేవి,20న రాజరాజేశ్వరీ దేవి, అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 సాముహిక కుంకుమార్చన, 11.45 గంటలకు మహా నివేదన, అనంతరం తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతిరోజూ సాయంత్రం 4.30 గంటలకు పండితులచే ప్రవచన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 20న మంగళవారం సాయంత్రం 6 గంటలకు శమీ పూజతో
మహోత్సవాలు ముగియనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.