*బతుకమ్మ కుంట వద్ద నెలకొన్న ఘోర అంధకారం*
*పట్టించుకోని అధికార యంత్రాంగం*
*పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్న పెద్ద చెరువు రోడ్డు – పాముల భయంతో వణికిపోతున్న మహిళలు*
*యుద్ధ ప్రాతిపదికన బతుకమ్మ కుంట వద్ద మరియు పెద్ద చెరువు రోడ్డు మీద LED లైట్లు వేయాలి*
*- JCB లు, ట్రాక్టర్లతో పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలి*
*- రోడ్డుకు మరమ్మతులు చేసి, బ్లీచింగ్, సున్నం చల్లి శుభ్రం చేయాలి*
*బతుకమ్మ పండుగవచ్చింది – ఇప్పటివరకు కదలని పంచాయతీ, మండల అధికారులు*
*లైట్లు, శుభ్రత పనులు వెంటనే చేపట్టాలి*
*పెద్ద శంకరంపేట (మెదక్ జిల్లా): ప్రజావాణి న్యూస్ ప్రతినిధి బాలరాజు*
తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. కానీ మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో మాత్రం దీనికి విరుద్ధంగా పరిస్థితి నెలకొంది. ఇక్కడి ప్రధాన బతుకమ్మ కుంట అధికారుల నిర్లక్ష్యంతో అంధకారంలో కూరుకుపోయింది.
*ఏళ్ల ఆనవాయితీకి అడ్డంకిగా మారిన నిర్లక్ష్యం:*
పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని బతుకమ్మ కుంట, పెద్ద చెరువు రోడ్డు ఈ ప్రాంతానికి కేంద్ర బిందువు. గత కొన్ని ఏళ్లుగా పెద్ద శంకరంపేటతో పాటు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది ఆడపడుచులు ఇక్కడికే వచ్చి బతుకమ్మలు వేసి, బతుకమ్మ ఆటలాడి, నిమజ్జనం చేయడం ఆనవాయితీ. బతుకమ్మ పండుగ అంటేనే ఈ కుంట కళకళలాడుతుంది.
కానీ ఈ ఏడాది పరిస్థితి పూర్తిగా భిన్నం. కుంటను చూస్తేనే మహిళలు వెనక్కి వెళ్లే పరిస్థితి.
*క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటే…*
బతుకమ్మ కుంట చుట్టూ ఉన్న 8 కరెంటు స్తంభాలకు లైట్లు ఉన్నా, ఒక్కటీ వెలగడం లేదు. పెద్ద చెరువు రోడ్డులో కూడా వీధి దీపాలు నెలల తరబడి పనిచేయడం లేదు. బతుకమ్మ వేసేది సాయంత్రం 5 గంటల తర్వాత. ఆ సమయానికి అక్కడ చిమ్మ చీకటి. ఆడవాళ్లు, చిన్న పిల్లలు చీకట్లో ఎలా వెళ్లాలి? ఎలా ఆటలాడాలి? అని ప్రశ్నిస్తున్నారు.
కుంటకు వెళ్లే దారి, చెరువు కట్ట, రోడ్డుకు ఇరువైపులా 6 అడుగుల ఎత్తున పిచ్చి మొక్కలు, జిల్లేడు, తుంగ, ముళ్ల కంపలు పెరిగి అడవిలా మారింది. వర్షాల వల్ల పాములు, తేళ్లు, క్రిమి కీటకాలు విపరీతంగా పెరిగాయి. అని తల్లులు భయపడుతున్నారు.

*మహిళల ఆగ్రహం – ప్రజల ఆవేదన:*
“ప్రభుత్వం బతుకమ్మ వేసే చోట లైటు కూడా వేయలేదు. ఇదేనా ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం?” అని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపాటికైనా బతుకమ్మ పండుగలు వస్తున్నాయి కాబట్టి, పెద్ద శంకరంపేట ప్రజలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు అధికారులను డిమాండ్ చేస్తున్న డిమాండ్లు:
ఈ పనులను వారం రోజుల్లో పూర్తి చేయకపోతే, పండుగ రోజున బతుకమ్మ కుంట వద్ద పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపడతామని మహిళా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికైనా *MRO, పంచాయతీ కార్యదర్శి* స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారూ

