📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ: గోదా అరుణ్ యాదవ్

ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ: గోదా అరుణ్ యాదవ్

📰 Generate e-Paper Clip

*ప్రకృతిని, పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగ: గోదా అరుణ్ యాదవ్*

*బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న గోద అరుణ్ యాదవ్*

తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతికగా ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని కొక్కొండ గ్రామ 1వ వార్డు సభ్యుడు జి.ఎస్ అరుణ్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామ 1వ వార్డు లో సద్దుల బతుకమ్మ సందర్బంగా ఏర్పాటు చేసిన బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించారు, ఈ సందర్బంగా అరుణ్ యాదవ్ మాట్లాడుతూ వార్డులో అక్క చెల్లలు సంబరంగా నిర్వహించుకునే పూల పండుగ బతుకమ్మ అన్ని అన్నారు. బతుకమ్మ పాటలతో ఆటలతో తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే సామజిక సంబురం ఈ పండుగ అన్ని కొనియాడారు.పూలనే దేవతగా కొలిచే గొప్ప సంస్కృతి, సంప్రదాయం మన తెలంగాణకే దక్కిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం, ఆస్తిత్వానికి ప్రతికగా ఈ పండగ నిలుస్తుందని స్పష్టం చేశారు. మహిళలందరు భక్తిశ్రద్దలతో బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని కోరారు. ఆ గౌరీ మత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పరిరవిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ములుగు పోలీస్ సిబంది,గ్రామ సర్పంచ్ విజేత, ఉప్పసర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ గణేష్, మాజీ ఉప్పసర్పంచ్ మహేష్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు చాకలి పోచమ్మ, పూడూరి క్రాంతి కుమార్, గ్రామస్థులు వాసుదేవ్ గౌడ్, బాబు, మహేందర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.