ఘట్కేసర్, అక్టోబర్ 20 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ వేముల మమత గౌడ్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి ప్రజల జీవితాల్లో నూతనోత్సాహాన్ని నింపాలని, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వారు కోరుకున్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని, సమాజంలో శాంతి, సోదరభావం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

