📄 ePaper
Epaper 2
Tuesday, October 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ఎండీ హరీఫ్

ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ఎండీ హరీఫ్

📰 Generate e-Paper Clip

*ఎల్లంపేట మున్సిపాలిటీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కౌన్సిలర్ ఎండీ హరీఫ్*

మేడ్చల్ (ప్రజా వాణి):- ఎల్లంపేట మున్సిపల్ ప్రజలందరికీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ 23 వార్డు కౌన్సిలర్ ఎండీ హరీఫ్ హృదయపూర్వక విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎండీ హరీఫ్ మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐకమత్యం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరూ విజయదశమి పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆయన సూచించారు. ప్రజలందరికీ విజయాలు చేకూరాలని, ప్రతి ఒక్కరి ఆశయాలు నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ విజయదశమి పర్వదినం ప్రజల జీవితాల్లో సరికొత్త ఆశలు, అవకాశాలు తీసుకురావాలని, ఎల్లంపేట మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలని ఎండీ హరీఫ్ ఆకాంక్షించారు. ప్రజలందరికీ మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.