📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ

ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ

📰 Generate e-Paper Clip

*ప్రకృతి, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ*

*తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలు: గోదా అరుణ్ యాదవ్*

మేడ్చల్,ప్రజావాణి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే గొప్ప పండుగ బతుకమ్మ అని కొక్కొండ గ్రామం 1వ వార్డు సభ్యుడు జి.ఎస్. గోదా అరుణ్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండ గ్రామంలోని 1వ వార్డులో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బతుకమ్మలకు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న గోదా అరుణ్ యాదవ్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ఆనందానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వార్డులో మహిళలు, అక్కాచెల్లెళ్లు అందరూ కలిసి బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు. బతుకమ్మ పాటలు, ఆటల ద్వారా మహిళలు తమ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ సామాజిక ఐక్యతను చాటుకుంటారని తెలిపారు. పూలనే దేవతగా భావించి పూజించే గొప్ప సంస్కృతి, సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకమని అరుణ్ యాదవ్ అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమై, పూలను పూజిస్తూ జరుపుకునే ఈ పండుగ మన సంస్కృతీ వైభవాన్ని తరతరాలకు చాటిచెబుతుందని తెలిపారు.
మహిళలందరూ భక్తిశ్రద్ధలతో, సంతోషంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని ఆయన కోరారు. గౌరీమాత ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విజేత, ఉపసర్పంచ్ జ్యోతి, ములుగు పోలీసు సిబ్బంది, మాజీ సర్పంచ్ గణేష్, మాజీ ఉపసర్పంచ్ మహేష్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు చాకలి పోచమ్మ, పూడూరి క్రాంతి కుమార్, గ్రామస్థులు వాసుదేవ్ గౌడ్, బాబు, మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.