పుట్టపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

పుట్టపహాడ్ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పరిగి, అక్టోబర్ 10( ప్రజావాణి) కుల్కచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలను అత్యంత ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేంద్ర బహదూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పాఠశాలకు తీసుకొచ్చారు. పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మలను ఉంచి, విద్యార్థినులు, ఉపాధ్యాయులు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు...