నర్సాపూర్ ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం

*నర్సాపూర్ ప్రాజెక్ట్ స్థాయి పోషణ మాసం కార్యక్రమం* *అంగన్వాడీ సేవలు అభినందనీయం – ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి* నర్సాపూర్. అక్టోబర్ 9 ప్రజావాణి నర్సాపూర్ మండలంలోని రైతు వేదిక వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హాజరై అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో అంగన్వాడీ టీచర్లు ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు....