*అమరవీరుల త్యాగాలు చిరస్మ
రణీయం*
*సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డిఎస్పి కృష్ణ కిషోర్*
తొర్రూరు
అక్టోబర్ 28(ప్రజావాణి)
పోలీస్ అమరుల త్యాగం చిరస్మరణీయమైనదని తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్ అన్నారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీసులు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డిఎస్పి కృష్ణ కిషోర్ ప్రారంభించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్సీ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 154 మంది,తెలంగాణలో నలుగురు పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. దేశ ప్రజల యొక్క శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా, నిరంతరం పనిచేస్తున్న పోలీస్ త్యాగాలు చరిత్రలో, అత్యంత కీలకమైనవే అన్నారు. ప్రజల మాన ప్రాణాలు, ఆస్తుల రక్షణ కొరకు నిరంతరం సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. అమరుల త్యాగానికి, ఘన నివాళి సమర్పించడం అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల సేవలు,విధి నిర్వహణలో వారు చేసిన త్యాగాలు, ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన కల్పించడమే సంస్మరణ వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజల చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ప్రతి పౌరుడు దేశ ప్రజల పట్ల సోదరా అభిమానాలు కలిగి ఉండి సామాజిక సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలుపంచుకోవాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు సిఐ గణేష్, ఎస్సైలు మహేందర్ రెడ్డి, వెంకన్న, ప్రమోద్ ,క్రాంతి కుమార్,ఖాదర్ బాషా, పోలీస్ సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ సారయ్య పరమేశ్వర్, పాష , మధు శ్రీలత రామచంద్రు , నరేష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

